మామయ్య నుంచి అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం కావాలి?: సమంత

వాస్తవం సినిమా: సోషల్ మీడీయాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ఈ సారి పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు మరికాస్త ఓపికతో సమాధానం చెప్పింది. ఈ సందర్బంగా ఒక అభిమాని పెళ్లిలో మీకు నాగార్జున గారు ఇచ్చిన బహుమానం ఏంటీ అంటూ ప్రశ్నించారు. అందుకు సమంత గడుసుగా నాకు మామయ్య పెద్ద గిఫ్ట్‌ ఇచ్చారు. ఆయన చైతూతో నా పెళ్లి ఒప్పుకోవడమే నాకు అన్నింటి కంటే పెద్ద గిఫ్ట్‌. అందుకు మించిన గిఫ్ట్‌ తనకు ఇంకేం అవసరం లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలను ఒప్పుకోక పోవడం వెనుక కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో సినిమాలను ఒప్పుకోక పోవడం ఏమీ లేదని, కొత్త సినిమాలను త్వరలోనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా తాను యూటర్న్‌ను పూర్తి చేశాను అని, తాజాగా చైతూతో కలిసి ఒక చిత్రాన్ని చేయబోతున్నాను అని, కొత్త సినిమాలు కూడా ఇంకా ఉన్నాయి అంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది.