‘మహా సంప్రోక్షణ’సమయంలో శ్రీవారి దర్శనంపై నేడు నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: తిరుమలలో ‘మహా సంప్రోక్షణ’ వేళ శ్రీవారి దర్శనంపై టీటీడీ పాలకమండలి కీలక భేటీ ఈరోజు జరగనుంది. సంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శనం పూర్తిగా రద్దు చేయడం పై విమర్శలు వెల్లువెత్తిన నేపద్యంలో , ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దీనిపై పున:పరిశీలన చేయాలని టీటీడీ పాలకమండలి భావించింది. ఈ మేరకు ‘సంప్రోక్షణ’ వేళ శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అనుమతించాలి? అనే అంశంపై నేడు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఈ అంశానికి సంబంధించి భక్తుల నుంచి ఇదివరకే అభిప్రాయాలు సేకరించారు. టోకెన్‌ విధానానికి వారు మొగ్గు చూపించడంతో ఇవాళ పాలకమండలి తుది నిర్ణయం తీసుకొనున్నది.వచ్చే నెల 11 న అంకురార్పనతో మొదలై 12 నుంచి 16 వరకు మహా సంప్రోక్షణ జరగనుంది.