ఫుట్ బోర్డ్ ప్రయాణం తో నలుగురు మృతి!

వాస్తవం ప్రతినిధి: ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం ప్రమాదం అని ఎన్ని సార్లు చెబుతున్నప్పటికీ యువత మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఒక ఫుట్ బోర్డ్ ప్రయాణమే నలుగురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. చెన్నయ్‌ లోకల్‌ ట్రైన్‌లో మంగళవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. చెన్నయ్‌ బీచ్‌ నుండి తిరుమాల్‌పూర్‌ వెళ్తున్న లోకల్‌ ట్రైన్‌లో యువకులు ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేస్తుండగా కరెంటు పోల్‌కు తగిలి ప్రాణాలు కోల్పోయారు. బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ ఫుట్‌బోర్డ్‌లో యువకులు వేలాడుతూ ప్రయాణించడం చూస్తూనే ఉంటాం. ఈ ఫుట్ బోర్డ్ ప్రయాణాల తో ఎందఱో యువత ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. అయినప్పటికీ యువత లో మాత్రం మార్పు రావడం లేదు.