పాక్ లో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

వాస్తవం ప్రతినిధి: పొరుగుదేశం పాకిస్థాన్ లో ఈ నెల 25వ తేదీన నేషనల్ అసెంబ్లీ తో పాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీ ల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ గత కొద్ది రోజులుగా జరుగుతున్నా ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రి తో ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన మత గురువులు సహా 12,570 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పెద్దగా ఉత్సాహం చూపని ఓటర్లు, ఉద్రిక్త వాతావరణం మధ్య చివరి నిమిషం వరకు అభ్యర్ధులు సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేషనల్‌ అసెంబ్లీ స్థానాలకు 3,675 మంది ప్రొవిన్షియల్‌ పదవులకు 8,895 మంది పోటీ పడుతున్నారు.