దక్షిణ ఆఫ్రికా లో కాల్పుల కలకలం….11 మంది డ్రైవర్ల మృతి!

వాస్తవం ప్రతినిధి: దక్షిణ ఆఫ్రికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు అక్కడి టాక్సీ డ్రైవర్ల ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది టాక్సీ డ్రైవర్లు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే గాయపడిన క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం……..దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులూ నటాల్‌ ప్రావిన్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్‌కు చెందిన మినీ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది డ్రైవర్లు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.