తాజ్ పరిరక్షణ పై తోలి విజన్ డాక్యుమెంట్ ని సమర్పించిన యుపీ సర్కార్

వాస్తవం ప్రతినిధి: ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన తాజ్‌ మహాల్‌ పరిరక్షణకు తీసుకునే చర్యలతో రూపొందించిన తొలి విజన్‌ డాక్యుమెంట్‌ను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్దానికి చెందిన తాజ్‌మహాల్‌ పరిరక్షణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఉదాశీనతపై ఈ నెల 11న సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజ్‌ మహాల్‌ను, దాని పరిసర వాతవరణాన్ని పరిరక్షించేందుకు సమగ్ర ప్రణాళికను తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. యుపీ ప్రభుత్వం రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ను న్యాయమూర్తులు ఎంబి లోకూర్‌,దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం ముందుంచినట్లు తెలుస్తుంది.