కేటీఆర్ కు వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు 42వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఒక స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్ రెడీ చేశారు. కేటీఆర్ మీద సినిమా సాంగ్ రేంజ్‌లో ఒక పాటను చిత్రీకరించి రిలీజ్ చేశారు. ఇందులో కేటీఆర్ చేస్తోన్న మంచిపనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా హోర్డింగులు, కటౌట్లు పెట్టి హడావిడి చేయవద్దని, అలా ఖర్చు పెట్టే సొమ్మును పార్టీకి విరాళంగా ఇవ్వండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్. అంతేకాదు తన బర్త్ డే వేడుకలకు పెట్టే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని పార్టీ అభిమానులను కేటీఆర్ కోరాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బొంతు రామ్మోహన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఫెక్సీలు కటౌట్లను కార్మికులతో కలిసి తీసి వేయిస్తున్నాడు.

మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు కూడా ఆయనకు ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. ‘మంచి స్నేహితుడు, గొప్ప నాయకుడు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్’ అంటూ గ్రీట్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాలను పక్కనపెట్టి, కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ’42వ జన్మదినం సందర్భంగా కేటీఆర్ కు నా బెస్ట్ విషెస్. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.