హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున మండీ ప్రాంతంలోని నెర్‌ చౌక్‌లోని రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో సిలిండర్‌ అకస్మాత్తుగా పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరికొంత మంది బిల్డింగ్‌లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ప్రమాదంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.