సిరియా లోని తూర్పు ఘౌటా ప్రాంతానికి రష్యా, ఫ్రాన్స్ సాయం!

వాస్తవం ప్రతినిధి: సిరియాలోని తూర్పు ఘౌటా ప్రాంతానికి సాయమందించాలని, రష్యా, ఫ్రాన్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒక పశ్చిమ దేశంతో కలిసి రష్యా సిరియాలో మానవతా సాయం చేపట్టడం ఇదే ప్రధమం. ఈ నేపధ్యంలో ప్రాధమిక చికిత్స నందించే కిట్‌లు, మందులు, ఇతర వస్తువులతో కూడిన రిలీఫ్‌ కాన్వాయ్లను స్థానిక ఆస్పత్రులకు పంపించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. అలానే అక్కడ సహాయ పంపిణీ కార్యక్రమాన్ని రష్యా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు ఘౌటా ప్రాంత ప్రజలకు వైద్య సంరక్షణ, మానవతా సాయం అందేలా రెండు దేశాలు కలిసి ఒక మానవతా ప్రాజెక్టు చేపట్టాలని భావించాయని ఈ నేపధ్యంలోనే అక్కడ సహాయ పంపినీ కార్యక్రమం చేపట్టినట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి.