షెల్టర్ హోమ్ లో మైనర్ బాలికల అత్యాచారాల పై సిబీఐ విచారణ: ఎంపీ పప్పూ యాదవ్

వాస్తవం ప్రతినిధి: బీహార్‌లోని షెల్టర్ హోమ్‌లో జరిగిన మైనర్ బాలికల అత్యాచారాల గురించి ఎంపీ పప్పూ యాదవ్ లోక్ సభ సాక్షిగా ప్రశ్నించారు. ఈ ఘటన పట్ల సీబీఐ విచారణ చేపట్టాలని సభ లో ఆయన డిమాండ్ చేశారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఎన్జీవోకు చెందిన షెల్టర్ హోమ్‌లో ఒక బాలికను రేప్ చేసి, ఆ తరువాత చంపి అక్కడే పాతి పెట్టారని అనుమానాలు వ్యఖ్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం స్థానిక పోలీసులు ఆ హోమ్ ని తమ అధీనంలోకి తీసుకొని తొవ్వకాలు చేస్తున్నారు. మరోపక్క షెల్టర్ హోమ్‌ను నడిపిస్తున్న ఎన్జీవో ఓనర్.. సీఎం నితీశ్ కుమార్‌కు సన్నిహితుడని, ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేశాడని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని లోక్ సభ లో ఎంపీ పప్పూ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.