మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరానికి ఊరట

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరానికి ఐఎన్ ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి మరోసారి భారీ ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో చిదంబరంను ఈడీ జులై 10 వరకూ అరెస్ట్‌ చేయరాదని కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులను సోమవారం పటియాలా హౌస్‌ కోర్టు ఆగస్ట్‌ 7 వరకూ పొడిగించడం తో చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. మరోపక్క ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం తాజాగా అప్పీల్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది.