మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాక్షి మహారాజ్

వాస్తవం ప్రతినిధి: 2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ఈ సమయంలో బీజేపీ నేతలు తమకు ఇష్టమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తూ, వివదాస్పదంగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా మీడియా తో మాట్లాడుతూ……షరియత్ కావాలని కోరుకునే వారు పాకిస్థాన్‌కు వెళ్లొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోకెల్లా భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం చాలా పటిష్ఠమైంది. షరియత్‌ను కోరుకునే వారు పాక్‌కు వెళ్లిపోవచ్చు. భారత్‌లో రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతుంది తప్ప, ఎటువంటి షరియత్‌ల వల్ల కాదు అని అన్నారు. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వారికి దేశంలో ఉండే హక్కు లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.