పోలవరం కు వ్యతిరేకంగా సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసిన ఒడిశా!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కే తలమానికమైన పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా సుప్రీం కోర్టు లో పిటీషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటీషన్ కు సంబంధించి సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఏ అంశాలపై వాదనలు వినిపించాలో నివేదిక ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు వాద ప్రతివాదులను కోరింది. అయితే ఈరోజు వాదనలు విన్న జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇప్పటికీ నివేదిక ఎందుకు తయారు చేయలేదని ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను ప్రశ్నించింది. దీనితో సుప్రీం ప్రశ్న పై స్పందించిన ఏపీ….. నివేదిక తయారీ కి ఒడిశా,తెలంగాణా రాష్ట్రాలు సహకరించలేదని వివరణ ఇచ్చింది. దీనితో ఏపీ వాదనల పై మిగిలిన రెండు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ కేసు వాద ప్రతివాదులను చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ పిటీషన్ కు సంబంధించి తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.