టీడీపీ పై కేంద్రం భారీ కుట్ర..చీలిక దిశగా..

వాస్తవం ప్రతినిధి: ఏపీలో పాగాకి బీజేపీ కుట్రలు పన్నుతోందా..? కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయినా టీడీపీ పార్టీ కూలిపోనుందా..? అసలేం జరుగుతోంది మోడీ ఏపీలో టీడీపీ పై వేసిన స్కెచ్ ఏమిటి? ఇప్పుడు ఈ వార్త ఏపీలో సంచలనం సృష్టిస్తోంది…విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ లో త్వరలోనే ప్రకంపనలు కలుగనున్నాయట. అవిశ్వాసం పేరుతో బీజేపీ ని ఇరుకున పెట్టాలని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి త్వరలో మోడీ చుక్కలు చూపించనున్నారు అని తెలుస్తోంది..వివరాలలోకి వెళ్తే..

అవిశ్వాసం ఎదుర్కున్న మోడీ ఎంతో సులభంగా బయటపడ్డారు..అయితే బాబు ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీ కి ఇప్పుడు అసలు షాక్ ఇవ్వనున్నారు మోడీ జీ అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారట…ఇన్నాళ్లు సమయం కోసం వేచి చూసిన మోడీ జీ బాబు పై అస్త్రాలు సిద్ధం చేశారని తెలుస్తోంది తాజాగా బీజేపీ సీనియర్ నేత..ఎమ్మెల్సీ రామ్ మాధవ్ ఏకంగా టీడీపీలోనే చీలిక రాబోతుందని చెప్పిన మాటలతో మోడీ గేమ్ స్టార్ట్ చేశారని అర్థం అవుతోంది…రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ లో అలజడి రేపుతున్నాయి..

టీడీపీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు పోరాటాలు ఏపీ పరువు తీసినట్టుగా ఉన్నాయని చంద్రబాబు ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడి తెలుగుదేశం కి ఉన్న పేరు మొత్తం తీసేశారని..ఎన్ఠీఆర్ కేంద్రాన్ని ఎదురొడ్డి ఏదన్నా సాధించే వారు కానీ చంద్రబాబు ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడి పరువు పోగొట్టుకున్నారని టీడీపీ సీనియర్ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారని రామ్ మాధవ్ చెప్తున్నారు..అయితే టీడీపీలో ఉన్న అసంతృప్తి రామ్ మాధవ్ కి ఎలా తెలిసింది..అంటే టీడీపీ లో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో బీజేపీ టచ్ లో ఉన్నారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..ఈ వ్యాఖ్యలకి బలం చేకూర్చేలా గతంలో అవిశ్వాసం సమయంలో సుజనా చౌదరి సైలెంట్ అవ్వడం..సుజనా టీడీపీ ని వీడిపోతున్నారు అనే వ్యాఖ్యలు వచ్చాయి..సుజనా కూడా ఈ వ్యాఖ్యలని పెద్దగా ఖండించలేదు కూడా .అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఇటువంటి ప్రయత్నాల్ని చేస్తుందా అంటే విశ్లేషకులు మాత్రం తప్పకుండా టీడీపీ ని దెబ్బకొట్టడం కోసం ఈ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.అంతేకాదు చాలా మంది సీనియర్ నేతలు టీడీపీలో తాము పడే అవమానాలు భరించలేక బయటకి వచ్చేయాలని అనుకునే వారు అందరూ ఇప్పుడు బీజేపీ లోకి క్యూ కట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.