జగన్ పాదయాత్ర @ 219వ రోజు

వాస్తవం ప్రతినిధి:ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 219వ రోజు సోమవారం ఉదయం ప్రారంభమైంది. సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా స్థానిక ప్రజలు వైఎస్‌ జగన్‌కు సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉండూరు నుంచి సామర్లకోట గాంధీబొమ్మ సెంటర్‌ మీదుగా రైల్వే స్టేషన్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. సామర్లకోట మాతం సెంటర్‌, అయోధ్యా రామాపురం, చలపతి నగర్‌ మీదుగా గణపతి నగర్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 2,574.9 కిలోమీటర్లు నడిచారు. 2017 న‌వంబ‌ర్ 6న వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా సాగి ప్రస్తుతం పదో జిల్లా తూర్పు గోదావరిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.