కెనడాలోని టొరంటోలో ఘోరం..విషాదంగా ముగిసిన బర్త్ డే పార్టీ

వాస్తవం ప్రతినిధి: కెనడాలోని టొరంటోలోని గ్రీక్ టౌన్ జిల్లాలోగల ఓ రెస్టారెంట్లో జరిగిన బర్త్ డే పార్టీ విషాదంగా ముగిసింది. ఆదివారం రాత్రి వేడుకగా సాగిన ఈ పార్టీలో ఓ వ్యక్తి రెచ్చిపోయి అదేపనిగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 13 మంది మృతి చెందారు. వివరాలప్రకారం.. స్థానిక గ్రీక్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌ వెలుపల పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు సహా మరొకరు మృతిచెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉందన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.కెనడా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు.