ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ నుంచి మరో స్టిల్ లీక్

వాస్తవం సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ లీకయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు నటిస్తున్నట్టు తెలుస్తుండగా, వారిద్దరిపై వర్షంలో తీసిన ఓ సీన్ కు సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో లీకైంది. ఓ ఎమోషనల్ సీన్ కు సంబంధించిన దృశ్యంగా ఇది కనిపిస్తుండగా, తన పక్కనే వాహనంలో కళ్లు మూసుకుపోయి, తల పక్కకు వాల్చిన నాగబాబును, ఎన్టీఆర్ దీనంగా చూస్తూ, గడ్డం పట్టుకుని లేపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పిక్ ను ఎవరు లీక్ చేశారో తెలియదుగానీ, క్షణాల్లో వైరల్ అయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఈషా రెబ్బా మరో కీలక పాత్రలో కనిపించనుంది. వచ్చే దసరా పండుగకు ఈ చిత్రం రిలీజ్ కానుంది.