అబ్బాయిలు కూడా ముద్దొస్తారు… రాశీఖన్నా !

వాస్తవం సినిమా: నితిన్‌, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా శ్రీనివాస క‌ల్యాణం.శతమానం భవతి సినిమా ద‌ర్శ‌కుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది.సినిమా టైటిల్‌ను బ‌ట్టే ఇది ఫ్యామిలీ క‌థ అని అర్థం అవుతుంది.ఇక టీజ‌ర్‌లో కూడా అదే చూపించారు.

టీజర్లో రాశీఖన్నా అందంగా కనిపించడమే గాక అబ్బాయిలకు అమ్మాయిలే ముద్దొస్తారా.. అమ్మాయిలకు అబ్బాయిలు రారా.. అంటూ చెప్పిన క్యూట్ డైలాగ్ యూత్ ఆడియన్సుకు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాపై అంచనాలు కూడ ఒకింత పెంచడమే కాక ఈసారి కూడ రాశీఖన్నాకు మంచి పాత్రే దొరికినట్టుందని అంటున్నారంతా. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలకానుంది.