సమంత ‘యూటర్న్’ ఫస్ట్ లుక్ విడుదల

వాస్తవం సినిమా: నాగచైతన్య తో వివాహం తరువాత మంచి జోరు మీదున్న సమంత వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’’ చిత్రాల విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న సామ్ చేస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది.అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్‌ని సామ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. ‘నేను నమ్మిన సినిమా ఇది. సెప్టెంబరు 13న ఈ సినిమా చూసి, మీరు కూడా ఇలానే అభిప్రాయపడతారని ఆశిస్తున్నా’ అని సమంత చెప్పింది.
కాగా, పవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బందరు సంయుక్తంగా సమర్పిస్తోంది. ‘యూటర్న్’లో ఆది పినిశెట్టి, రాహుల్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను సమంత పూర్తి చేసుకుంది. ‘రంగస్థలం’ తర్వాత సమంత నటిస్తున్న చిత్రం ‘యూటర్న్’. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో సమంత కనిపించనుంది.