రిజర్వేషన్ల విషయం లో బీహార్ సర్కార్ కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారుల సలహా మేర​కు సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి బీహార్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన ను విడుదల చేసింది.  గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని భావిస్తోన్న నేపధ్యంలో దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిపారసులకు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లలను కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే మరోపక్క లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీసుకున్న ఈ నిర్ణయం  ఏమేరకు ప్రతిఫలం ఇస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.