రాజకీయ పార్టీలు బాధ్యతయుతంగా వ్యవహరించటంలేదు :మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు

వాస్తవం ప్రతినిధి: రాజకీయ పార్టీలు బాధ్యతయుతంగా వ్యవహరించటంలేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విభజన సమయంలో మొండిగా వ్యవహరించిన పార్టీలనేతలు ఈరోజు అవిరాలేదు…ఇవిరాలేదని మాట్లాడుతున్నారన్నారు. . ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .”నేను ఏపార్టీకి చెందిన వాడిని కాదు…ప్రజలకు మంచి చెడు, తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చా…బిజెపిని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయన్న ఏజెండతో అధికార, ప్రతిపక్షాలు బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నాయి… రాజకీయ పార్టీలు ప్రజలను కొందరు రెచ్చగొట్టి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంపుపై కేంద్రానికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన సియం, ఢిల్లీ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లకు పరిమితం కావటం వల్ల ఉపయోగం ఉండదు. ఇవ్వమని కేంద్రం స్పష్టంగా చెప్పినా, ప్రత్యేక హోదా గురించి పదేపదే ప్రతిపక్షం, అధికార పక్షం చెప్పటం తగదు…హోదా వల్ల ఎలాంటి రాయితీలు ఉండవని, ప్యాకేజీ వల్ల ఉపయోగమని పాలకపక్షం అనేక మార్లు చెప్పింది.ఒకేసారి డబ్బులు ఇవ్వడం ఎవరికైనా సాధ్యం కాదు….కేంద్ర సంస్ధల ఏర్పాటు బాధ్యతలు మొత్తం కేంద్రమే చూడాల్సి ఉంటుంది.అదికార టిడిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ బృతి, రుణమాఫి లాంటివి అమలు చేయటానికే నాలుగేళ్ళ సమయం పట్టింది…కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు కూడా సమయం పట్టె అవకాశం ఉంటుంది….కేంద్రం వద్ద కూర్చుని సమస్యలు పరిష్కారించు కావాల్సిన పాలకపక్షం ఢిల్లీ లో ప్రెస్ మీట్ లకు పరిమితమౌతుంది…ఓట్ల రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టవద్దు..ప్రతిపక్ష నేత జగన్ ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నాడన్న ప్రదాని వ్యాఖ్యలు సరైనవే…అదే సమయంలో జగన్ కూడా మీడియా ఉచ్చులో చిక్కుకున్నాడు.ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు సమాజంలో ఉన్న మేధావులతో కలసి ఓ నాన్ ఫొలిటికల్ ఫోరం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ” అని అభిప్రాయపడ్డారు.