మూడో రోజుకు చేరుకొన్న లారీ యజమానుల సమ్మె

వాస్తవం ప్రతినిధి:తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా లారీ అసోసియేషన్ యాజమాన్యం చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో సరకుల రవాణా నిలిచిపోయింది. కోట్లాది రూపాయలు నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 లక్షల మేర లారీలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు. డీజిల్‌ను జిఎస్టీ పరిధిలోకి తేవాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించాలి యజమానులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.