మంత్రి దేవినేని,వల్లభనేని వంశీ ల మధ్య కోల్డ్ వార్

వాస్తవం ప్రతినిధి:  ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ ల మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మంత్రి ఉమ సొంత నియోజకవర్గం మైలవరంకు నీరు ఇచ్చి,గన్నవరం నియోజవర్గ రైతులకు నీరు ఇవ్వకపోవడం పై ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్‌ మండలాల్లో పట్టిసీమ నీరు అందక నారుమళ్లు, వరినాట్లు ఎండిపోతున్నాయి. రైతుల ఇబ్బందుల విషయమై విద్యుత్‌ శాఖ ఎండీ, చైర్మన్‌ నాయక్‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ లేఖ రాసినప్పటికీ ఉమ అడ్డుపడుతుండటంతో ఈ విషయాన్నీ సి ఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని వంశీ భావిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే సమస్య రావడంతో వల్లభనేని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు విద్యుత్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.