ఫాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్న మెగా హీరోలు

 వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు మెగా అభిమానులు. ఆ రోజంటే మెగా అభిమానులకు పండగే. ఆ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ సారి మెగా హీరోలు అభిమానులకు డబుల్ ధమాకా దక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి తాజాగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 22.. మెగాస్టార్ పుట్టిన రోజున ‘సైరా’ టీజర్, లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం చెర్రి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఒకే రోజున తండ్రి తనయుల సినిమాల నుంచి ఫస్టులుక్స్ రానున్నాయన్న వార్త తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ నటిస్తున్న ‘సైరా’ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.