‘పేప‌ర్ బోయ్’ టీజ‌ర్‌: బీటెక్ కుర్రాడి ల‌వ్ స్టోరీ

వాస్తవం సినిమా:దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంపత్‌ నంది, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి ‘పేపర్‌బాయ్’ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ నిమిషం నిడివిగల టీజర్ రిలీజైంది. సంతోష్ శోభ‌న్‌, రియా సుమ‌న్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. జ‌య శంక‌ర్ ద‌ర్శ‌కుడు. అనుకున్న‌ట్టే ఇదో పేప‌ర్ బోయ్ ప్రేమ‌క‌థ‌. ”అయిదున్న‌ర అడుగుల సంప్ర‌దాయం త‌ను.. యాభై కిలోల తెలుగుద‌నం త‌ను. అందుకే ఐదేళ్లుగా త‌నింటికి ప్ర‌తీరోజూ వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పి వ‌స్తున్నా”..అనే డైలాగ్‌తో ఈ పేప‌ర్ బాయ్ ల‌క్ష్య‌మేంటో చెప్పేశాడు. విజువ‌ల్ బ్యూటీ ఈ టీజ‌ర్‌లో క‌నిపించింది. చిన్న సినిమా అయినా, రిచ్ గా తీసిన‌ట్టు అనిపిస్తోంది. శోభన్ – రియాల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరిన‌ట్టుంది. బీటెక్ చ‌దివి.. బ‌త‌క‌డం కోసం పేప‌ర్ బోయ్ అవ‌తార‌మెత్తిన ఓ కుర్రాడు… త‌న ప్రేమ‌ని, భ‌విష్య‌త్తునీ ఎలా ద‌క్కించుకున్నాడు? అనే పాయింట్‌తో సాగే క‌థ ఇది.