కానిస్టేబుల్ ను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదుల ఎన్ కౌంటర్

వాస్తవం ప్రతినిధి: కానిస్టేబుల్ సలీమ్ అహ్మద్ షాను కిడ్నాప్ చేసి, దారుణాతి దారుణంగా హింసించి చంపిన ఉగ్రవాదులను ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కుల్గామ్ సలీమ్ అహ్మద్ ను హత్య చేసిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది.వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఆదివారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.గత శుక్రవారం కానిస్టేబుల్‌ మహమ్మద్‌ సలీంను అపహరించి ఉగ్రవాదులు హతమార్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. బలగాలకు తారసపడ్డ ఉగ్రవాదులు.. వీరిపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.