ఉండవల్లి లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్

వాస్తవం ప్రతినిధి: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధాని లో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉండవల్లిలో రైతులతో  ఆదివారం పవన్ సమావేశమైనట్లు తెలుస్తుంది. ఉండవల్లిలోని భూముల్లో పర్యటించిన పవన్‌ రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ పొలాల్లోకి తాము వెళ్లాలన్నా ఆధార్‌ కార్డు చూపించమంటున్నారని, చూపించకపోతే గెంటేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తాము నిద్ర లేని జీవితాన్ని గడుపుతున్నామని, ఇంత దారుణం ఎక్కడా లేదని వారు వాపోయారు. ఒకప్పుడు చంద్రబాబు చెప్పుల్లేకుండా వచ్చి తమకు ఓట్లడిగారని, ఇప్పుడు గెంటేస్తున్నారని రైతులు పవన్‌ కి తెలిపారు. అలానే పంటలు పండడం లేదంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని వారు మొరపెట్టుకున్నారు.