అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం

వాస్తవం ప్రతినిధి: అమెరికా లోని మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా లోని లాస్‌ఏంజెల్స్ లోని ఒక సూపర్ మార్కెట్ లో ఈ కాల్పుల మోత మోగినట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌లోకి దుండగుడు ప్రవేశించి అక్కడికి వచ్చిన కస్టమర్స్‌ను బందీలుగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువతి తీవ్రగాయాల పాలైంది.అత్యంత రద్దీగా ఉండే సూపర్‌ మార్కెట్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుకు చేసుకుంది. మార్కెట్‌ లోపలికి ప్రవేశించిన దుండగుడు అక్కడ ఉన్న దాదాపు 40మందిని బందీలుగా చేసి.. ఇద్దరు మహిళలపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దుండగుడి బామ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి ప్రియురాలు తీవ్రంగా గాయపడింది. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారై మరో సూపర్‌ మార్కెట్‌లో దాక్కున్నాడు. అక్కడున్న వాళ్లను కూడా భయభ్రాంతులకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు సూపర్‌ మార్కెట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.