అంత శక్తి పవన్ కల్యాణ్ కు లేదు: చినరాజప్ప

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీని ఓడించే శక్తి పవన్‌ కల్యాణ్‌కు లేదని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్‌ బంకును ఆదివారం ఉదయం ప్రారంభించిన మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు.జగన్, పవన్ కల్యాణ్ లు బీజేపీతో కుమ్మక్కై… టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది టీడీపీ మాత్రమేనని చెప్పారు. జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, పవన్ కల్యాణ్ కు జ్ఞానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకే వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిందని దుయ్యబట్టారు.