5 నిమిషాలు..కోటిన్నర..వహ్వా ఎన్టీఆర్

వాస్తవం సినిమా: నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ అలాంటిలాంటిది కాదు..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ ఎన్టీఆర్ తరువాత బాలయ్య బాబు కి ఎంత ఆదరణ ఉందో అదే తరహాలో అతి తక్కువ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటన డ్యాన్స్ లతో ఉర్రూతలూగించాడు.నందమూరి వారసుడు అనిపించాడు.అయితే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా టాప్ లిస్టు లో ఉన్న ఎన్టీఆర్ ఇక మీదట తన హవాని హాలీవుడ్ లోకూడా కొనసాగించాలని ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని అంగీకరించాడు..అయితే
తాజాగా ఎన్టీఆర్ మరో క్రేజీ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు..ఎన్టీఆర్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవడానికి వాణిజ్య సంస్థలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చినా సరే ఎవరికీ హామీ ఇవ్వని ఎన్టీఆర్ తాజాగా ఒక యాడ్ లో నటించడానికి సిద్దపడ్డాడు..అందుకోసం భారీ రెమ్యునిరేషన్ కూడా తీసుకున్నాడట..ఇంతకీ ఆ యాడ్ దేనికోసం అంటే..
ఒక మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు సెలెక్ట్ అనే మొబైల్స్ కోసం ఆ యాడ్ లో కనిపించనున్నాడు ఎన్టీఆర్..కేవలం 5 నిమిషాల యాడ్ కోసం ఆ మొబైల్ సంస్థ ఎన్టీఆర్ కి కోటిన్నర ఇచ్చిందని టాక్..అయితే ఎన్టీఆర్ ఇంతకు ముందు మలబార్ గోల్డ్, నవరత్న తైళం యాడ్స్ లో కనిపిస్తున్నాడు వాటికోసం కోటి రూపాయలు తీసుకుంటే ఈ మొబైల్ యాడ్ కి మాత్రం కోటిన్నర తీసుకున్నాడు అంటూ వస్తున్న ఈ న్యూస్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచేస్తోంది ఇది మా ఎన్టీఆర్ స్టామినా అంటూ కుషీ అవుతున్నారు.