సింగపూర్  పై హ్యాకర్ల కన్ను!

వాస్తవం ప్రతినిధి: సింగపూర్‌పై హ్యాకర్ల కన్ను పడింది. అక్కడి ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన డాటాబేస్‌ నుంచి ఏకంగా 15 లక్షల మంది పౌరుల ఆరోగ్య వివరాలను సైబర్‌ నేరగాళ్లు తస్కరించినట్లు తెలుస్తుంది. అయితే అసలు అక్కడి ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ ఆరోగ్య రహస్యాలను కాజేయడానికే ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు భావిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆకతాయి చర్య కాదనీ, చాలా తెలివిగా, పథకం ప్రకారం జరిగిన దాడి అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హ్యాకర్లు 2015, మే 1నుంచి ఈఏడాది జులై 4వరకు సింగపూర్‌లోని క్లినిక్‌లను సందర్శించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. దాదాపు 2లక్షల మంది రోగుల పేర్లు, చిరునామా, ప్రెస్క్రిప్ఫన్‌ సమాచారాన్ని హ్యాకర్లు చాకచక్యంగా సేకరించారు. ఆరోగ్య సమాచారం హ్యాకింగ్‌కు గురి కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు తెలుస్తుంది.