పూణే లో కుప్పకూలిన భవనం!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలోని పుణెలో ఈ రోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. పూణే లోని కేశవనగర్‌లోని ఓ భవనం కుప్పకూలడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. దీనితో వెంటనే ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.