పాదయాత్రలో జగన్… “కీలక ప్రకటన”

వాస్తవం ప్రతినిధి: నిన్నటి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ఎదో చేస్తారు అంటుకుంటే జగన్ ముందు నుంచీ బిజేపీ పై ఎక్కుపెట్టిన బాణాలని కాస్త మోడలింగ్ చేసి మెరుగులు దిద్ది గల్లా ,రామోహన్ నాయుడు బీజేపీ పై సంధించారు తప్ప గొప్పగా కానీ కొత్తగా కానీ చెప్పింది ఏమీ లేదు..అసలు ప్రత్యేక హోదా వస్తే ఏంటి రాకపోతే ఏంటి ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది కదా అంటూ చెప్పిన గల్లా ఇప్పుడు గొంతు చించుకుని హోదా అని అరిస్తే ప్రయోజనం ఏమి ఉంది? ఇదే విషయాన్ని మోడీ నిండు సభలో అదే గల్లా ముందు కుండ బద్దలు కొట్టేలా చెప్పారు.
ఈ మొత్తం ఎపీసోడ్ లో అవిశ్వాసం కేంద్రం ముందు వీగిపోతుందని తెలిసినా బాబు ఎందుకు ముందుకు అడుగు వేశారు అంటే కేవలం ఏపీ ప్రజల్లో మేము ఏపీ కోసం పోరాడాము అని చెప్పుకోవడానికే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు సమావేశాలు అయిపోతాయా టీడీపీ వీపీ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసిన జగన్ కి మంచి సమయం చిక్కింది. ఎప్పుడు ఎలా ఇరికించాలి అని ఆలోచిస్తున్న జగన్ కి బాబు పిలక సరిగ్గా దొరికింది..అందుకే ఇప్పుడు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు..అందులో భాగంగానే…
జగన్ కాకినాడలో తన పాదయాత్ర కొనసాగుతుండగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ నిన్న పార్లమెంట్ లో జరిగిన అంశాలపై స్పందించారు…ఏపీ ప్రజలని చంద్రబాబు మోసం చేశారని మేము హోదా కోసం పోరాటం చేస్తున్న సమయంలో చంద్రబాబు హోదా ఎందుకు అంటూ ఎంతో మందిని జైళ్ళ లో పెట్టారని గుర్తు చేశారు..అందుకే బాబు పై ఒత్తిడి పెంచేలా కేంద్రానికి మన గొంతు వినిపించేలా హోదాపై ఉద్యమిద్దాం అంటూ కీలక ప్రకటన చేశారు.

ఈనెల మంగళవారం అంటే 24వ తేదీన హోదా ఇవ్వని కారణంగా బాబు ఎపీని పట్టించుకోని కారణంగా రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు…ఏపీ ప్రజలు అందరూ ఈ బంద్ లో స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు…ఎక్కడికక్కడ బస్సులను, రహదారులను దిగ్బంధించాలని, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, తన ఎంపీలతో రాజీనామా చేయించేంత వరకూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు జరుపుతూనే ఉండాలని అన్నారు జగన్ మోహన్ రెడ్డి..కేంద్రంలో ఎవరు హోదా ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని మరో సారి గుర్తు చేశారు జగన్..చంద్రబాబు నీ ఎంపీలతో రాజీనామా చేయించి గెలిపించుకునే దమ్ము నీకు ఉందా నా సవాల్ స్వీకరిస్తావా ..?అంటూ చంద్రబాబు ని ఏకేశారు..బంద్ లోకి టీడీపీ ఎంపీలు కూడా వచ్చి కూర్చుని సహకరిస్తే హోదా తెచ్చుకోవచ్చు అంటూ ప్రకటన చేశారు.