కొత్త తరహ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించిన రష్యా

వాస్తవం ప్రతినిధి: రష్యా కొత్త తరహ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది. తమ దేశంలో రూపొందించిన కొత్త తరహా రక్షణ క్షిపణి వ్యవస్థను కజకిస్తాన్‌లోని టెస్టింగ్‌ రేంజ్‌ నుండి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. అత్యాధునికంగా దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి వ్యవస్థను రష్యా వాయుసేన విభాగం కజకిస్తాన్‌లోని సారీ షాగన్‌ ఫైరింగ్‌ రేంజ్‌ నుండి విజయవంతంగా ప్రయోగించిందని రష్యన్‌ ఎయిరోస్పేస్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ కమాండర్‌ ఆండ్రీ ప్రిఖోడ్కో మీడియాకు తెలిపారు.