ఏపీలో కీలక పరిణామాలు…బాబు పై “మోడీ అస్త్రం” సిద్దం

వాస్తవం ప్రతినిధి: చంద్రబాబు పై కేంద్రం ఓటుకు నోటు అస్త్రం తీయనుందా..? మోడీ ని మిస్టర్ మోడీ అని యావత్ భారత దేశ ప్రజలందరికీ వినిపించేలా తన యంగ్ ఎంపీలతో అనిపించిన బాబుని మోడీ జీ టార్గెట్ చేశారా..? త్వరలో ఏపీలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేయనుందా అంటే అవుననే చెప్పాలి. నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం అవిశ్వాసం వీగిపోయిన తరువాత మోడీ జీ మాట్లాడిన మాటలకి ఆ ప్రసంగంలో మోడీ జీ చేసిన కీలక వ్యాఖ్యల్ని చూసి మేధావులు ,విశ్లేషకులు దాదాపు ఒక అంచనాకి వచ్చేశారు ఇంతకీ మోడీ జీ ఏమన్నారు..? ఏపీలో జరగబోయే ఆ కీలక పరిణామాలు ఏమిటి అంటే..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక పక్క కేంద్రాన్ని ఏపీ ప్రజల ముందు బూచిని చేసి చూపిస్తూ మరో పక్క ఏపీకి ప్రత్యేక హోదాకోసం ఎంతో పోరాడాము కేంద్రం మనల్ని మోసం చేసింది ఇందుకు పవన్ కళ్యాణ్ ,జగన్ చేతులు కలిపారు అంటూ ఒక అందమైన కధని అల్లుతూ వచ్చారు…ఏపీలో ప్రజలని మభ్యపెట్టే పనిలో గడిచిన కొన్ని నెలలుగా ఇదే విషయాన్ని తమ నేతలు అందరితో రీలు మీద రీలు వేయించారు..ఫలితంగా ప్రజలు కూడా బాబు సీనియర్ కదా అంటూ నమ్మే వాళ్ళు నమ్మేశారు కూడా అయితే నిన్న జరిగిన అవిశ్వాస మీటింగ్ బిల్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాక మోడీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
మోడీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీ తెలుగుదేశం ఎంపీలకి వీక్షిస్తున్న బాబు కి మంత్రులకి అందరికి హోల్సేల్ గా దిమ్మతిరిగి పోయింది.. ప్యాకేజీకి జీ హుజూర్ అంటూ తలకాయలు ఊపిన వాళ్ళు ఇప్పుడు తలలు ఎగరేస్తున్నారు అనేట్టుగా మోడీ ప్రసంగం సాగింది..అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ నిలదీశారు .హోదా కంటే పత్యేక ప్యాకేజీ బాగుంది అంటూ గల్లా చెప్పి ఇప్పుడు ఆయనే గొంతు చించేలా ఎందుకు మాట్లాడుతున్నారో వారికే వదిలేస్తున్నా అంటూ చురకలు అంటించారు..అప్పుడు ఒకే చెప్పి ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారో మీరు చెప్పాలని మోడీ ఫైర్ అయ్యారు..దీంతో ఇప్పటి వరకూ బాబు ఏపీలో ఆడింది డ్రామా అని తేటతెల్లం అయ్యింది..ఇక ఈ వ్యాఖ్యలు చేస్తూనే మోడీ ఇంకొక కీలక వ్యాఖ్య చేశారు..
మోడీ నోట ఎప్పుడూ రాని ఓటుకు నోటు మాట వచ్చింది ఈ వ్యాఖ్యలతో టీడీపీ ఖంగుతింది..అసలు మోడీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు అంటూ మాధనపడ్డారు.. ఎన్డీయే నుంచీ మీరు తప్పుకున్నప్పుడు వైసీపీ ఉచ్చులో మీరు పడుతారని ఫోన్ చేసి చెప్పాను..అసలు వివాదం అంతా ఏపీలో ఉంచుకుని మీరు ఇక్కడ సభలో పోరాడుతున్నారు. మీరు ఓటుకు నోటు సంగతి మర్చిపోయినట్టు ఉన్నారు..మీరు ప్రతీ విషయాన్ని మర్చిపోతారు అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు టీడీపీని భారీ షాక్ ని ఇచ్చాయి..అయితే ముందుగానే మోడీ పక్కా ప్లాన్ గా ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారా లేక అనుకోకుండా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ ఎవరికీ వారు ఊహించుకుంటున్నారు..అయితే మోడీ త్వరలోనే ఓటుకు నోటు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని కొంతమంది అంటుంటే..బాబుగారికి శ్రీ కృష్ణ జన్మ స్థానంకి వెళ్ళే టైం వచ్చిందంటూ కొంతమంది ఎవరి ఊహలకి తగ్గట్టుగా ఊహించుకుంటున్నారు..మరో మోడీ ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.