ఎన్నికలు దగ్గర పడుతుండడం తో ప్రచారాన్ని ఉధృతం చేసిన పార్టీ లు

వాస్తవం ప్రతినిధి: ఈ నెల 25 న పాక్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నెల 25న జరుగనున్న ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 272 స్థానాలను ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పార్ల మెంట్‌, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు ఒక్కొక్కరూ కూడా రెండు ఓట్లను వేయనున్నారు. పార్లమెంట్‌లో 60 స్థానాలను మహిళలకు, 10 స్థానాలను మైనార్టీలకు కేటాయించారు. వీటిని ఐదుశాతం దామాషా ప్రాతినిధ్య విధానం లో కేటాయించనున్నట్లు తెలుస్తుంది. అయితే గత ఏడాది జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో 11 నియోజక వర్గాలు ఏర్పాటు కాగా, అంతకు ముందు వున్న నియోజకవర్గాల పరిధులు మారిపో యాయి. ఈ నేపధ్యంలో అత్యధిక జనాభా వున్న పంజాబ్‌ ప్రావిన్స్‌లో స్థానాలు 148 నుండి 141కి తగ్గినట్లు తెలుస్తుంది.