వచ్చే నెల 5వ తేదీన గోపీచంద్ ” పంతం” విడుదల

 వాస్తవం సినిమా: మొదటి నుంచి కూడా గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాలే ఆయనకి ఎక్కువగా విజయాలను తెచ్చిపెట్టాయి కూడా. ఈ సారి కూడా ఆయన అదే తరహా కథతో కూడిన ‘పంతం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్ పైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
“ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద పదిమంది సంతకాలు పెట్టే పద్ధతి మారితేనే గాని సామాన్యుడికి ఏ సాయం అందదు”. “అవినీతి చేసే ఒక నాయకుణ్ణి అరెస్ట్ చేస్తే మాత్రం బంద్ లు చేస్తాం .. ధర్నాలు చేస్తాం .. బస్సులు తగలబెట్టేస్తాం అంటూ ప్రతి ఒక్కడూ రోడ్డుకెక్కేస్తాడు. వాడు కాజేస్తున్నది నీ అన్నాన్ని .. నీ భవిష్యత్తుని .. నీ బతుకునురా .. ” అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. వచ్చెనెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు .