రంగారెడ్డి జిల్లా లో విషాదం

వాస్తవం ప్రతినిధి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షాబాద్‌ మండలం గోపిగడ్డలో ఒక చిన్నారి స్కూల్ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఏడాదిన్నర చిన్నారి ఆద్య తన అన్న ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తండ్రితో కలిసి బయటకు వచ్చింది. అయితే అన్న బస్సు ఎక్కుతున్న సమయంలో చిన్నారి ఆద్య ఆడుకుంటూ బస్సు కిందకు వెళ్ళింది. అయితే ఆద్యను గమనించని బస్సు డ్రైవర్ బస్సును కొంచం ముందుకు నడపడం తో చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది.