మరోసారి నితిన్ తో జోడీ కడుతున్న హన్సిక

వాస్తవం సినిమా: నితిన్ హీరోగా ప్రస్తుతం శ్రీనివాస కల్యాణం అనే సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. ఇందులో హీరోయిన్ గా హన్సికను తీసుకున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో సీతారాముల కల్యాణం లంకలో అనే సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు, దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత నితిన్-హన్సిక కలిసి వర్క్ చేయబోతున్నారు. ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. వచ్చేనెలలో సినిమాను ప్రారంభించి, ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.