బిసారియా చేసిన ఆరోపణల ను తోసిపుచ్చిన పాక్

వాస్తవం ప్రతినిధి: భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియాను ఇస్లామాబాద్‌ సమీపంలోని ప్రముఖ గురుద్వారలోకి వెళ్లేందుకు అనుమతించలేదంటూ వచ్చిన ఆరోపణలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. భారత్‌లో వివాదాస్పద సినిమాల విడుదలకు నిరసనగా సిక్కుల నిరసనల నేపథ్యంలో దౌత్యవేత్త తన పర్యటనను వాయిదా వేసుకున్నారు తప్ప ఎవరూ కూడా ఆయన గురుద్వార వెళ్లేందుకు అనుమతించలేదు అన్నది అవాస్తవం అని పాక్ వివరణ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లో తమ హైకమిషనర్‌, కాన్సుల్‌ అధికారులను గురుద్వారాలోకి అనుమతించకపోవడంపై ఢిల్లీలో పాక్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సయ్యద్‌ హైదర్‌షాకు భారత్‌ నిరసన తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ఈ మేరకు స్పందించింది. భారత యాత్రికులను కలిసేందుకు, గురుద్వారను సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని భారత ఇటీవల హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తాను పాకిస్తాన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే బిసారియా ఆరోపణలను పాక్ ఖండించింది.