ప్రపంచ కప్ లో స్పాట్ ఫిక్సింగ్ చేయమన్నారు: ఉమర్ అక్మల్

వాస్తవం ప్రతినిధి: ప్రపంచ కప్ సమయంలో తను స్పాట్ ఫిక్సింగ్ చేయవలసిందిగా బుకీలు సంప్రదించినట్లు పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ తెలిపాడు.  2015 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌తో జరగబోయే మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్‌ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు అక్మల్ తెలిపాడు. టోర్నీలో భారత్‌తో అదే మా మొదటి మ్యాచ్‌. అంతకుముందు కూడా అలాంటి ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించా. మరోసారి ఇలాంటి ఉద్దేశాలతో నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా చెప్పా’’ అని అక్మల్‌ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి (107) సెంచరీ చేయడంతో భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే.