ప్రతిపక్షానికి హెచ్చరికలు జారీ చేసిన గవర్నర్

వాస్తవం ప్రతినిధి: ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై గవర్నర్‌ భన‍్వరిలాల్‌ పురోహిత్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జిల్లాల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్యటనను అడ్డుకోవాలని యత్నిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రతిపక్షానికి గవర్నర్‌ హెచ్చరికలు జారీచేశారు. ‘గవర్నర్‌కు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వాటిననుసరించి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. కాదని ఎవరైనా విఘాతం కలిగించాలని యత్నిస్తే వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే. ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం గవర్నర్ కార్యకలాపాలను అడ్డుకునేవారిపై కేసు నమోదుచేసి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది’ అంటూ రాజ్‌భవన్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.