చిరు జడ్జిమెంట్ పై తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పిన జక్కన్న

వాస్తవం సినిమా: మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా లాంచ్ చేస్తూ తెరకెక్కించిన విజేత సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ బజ్ పెంచేలా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ చేశారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళిని ఈ ఈవెంట్ కు ఇన్వయిట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..‘‘చిరంజీవి చాలా మంచి యాక్టర్.. మంచి డ్యాన్సర్.. మంచి ఫైటర్. ఇవి అందరికీ తెలిసిన విషయాలు. ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలిసిన విషయం ఇంకోటుంది. అది చిరుకు స్టోరీని జడ్జ్ చేయడంలో స్పెషల్ స్కిల్ ఉంది. స్టోరీ విన్నవెంటనే అందులోని మంచి చెడులు.. కావాల్సింది ఏమిటి.. లేనిది పర్ ఫెక్ట్ గా చెప్పేస్తారు. మగధీర కథ కూడా ముందుగా చిరంజీవికే చెప్పాం. చిరు ఓకే అన్నారంటే అందరికీ వచ్చే కాన్ఫిడెన్స్ సినిమా బాగుంటుందని.. ఇప్పుడు విజేత కూడా ఆయన ఓకే చేశాకే తీశారు బాలా బాగుంటుందని అనుకుంటున్నాం’’ అంటూ జక్కన్న చిరు జడ్జిమెంట్ పై తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.