ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దంగా ఉన్నాం: విజయసాయి రెడ్డి

వాస్తవం ప్రతినిధి: శ్రీకాకుళంలో సోమవారం విలేకరుల సమావేశంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కుంటామన్నారు. నాలుగేళ్ల టిడిపి పాలనలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ రూ.3 లక్షల కోట్లు అవినీతికి పాల్పడి దోచుకున్నదాన్ని విదేశాలకు తరలించారని ఆయన ఆరోపించారు. అయితే పొత్తులు విధానపరమైన నిర్ణయం అంటూ తప్పించుకున్నారు. టిడిపి చేసినట్లే , బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన చెప్పారు.