ఉభయ కొరియా ల మధ్య పూర్తి స్థాయి సైనిక సంబంధాలు

వాస్తవం ప్రతినిధి: ఉభయ కొరియాల మధ్య పూర్తి స్థాయి సైనిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాల అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇరుదేశాల సైన్యాల మధ్య కమ్యూనికేషన్‌ లైన్ల పూర్తి స్థాయి పునరుద్ధరణపై సోమవారం చర్చలు జరుగుతాయని సియోల్‌ రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. గత గురువారం ఇరుదేశాల సరిహద్దుల్లోని పన్మున్‌జోమ్‌ గ్రామంలో ఇరుసైన్యాల ఉన్నతాధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌ 27న ఇరుదేశాల అధినేతలు కిమ్‌జోంగ్‌ ఉన్‌, మూన్‌ జేఇన్‌లు సంతకాలు చేసిన చారిత్రాత్మక ఒప్పందం అమలు ప్రధాన అజెండాగా సోమవారం ఇరు దేశాల సైన్యాధి కారుల భేటీ జరుగనున్నట్లు తెలుస్తోంది.