శ్మశానంలో గడుపుతోన్న ఎమ్మెల్యే.. అక్కడే తిండి, నిద్ర!

వాస్తవం ప్రతినిధి: తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా జరగాలని ఓ ఎమ్మెల్యే శ్మశానంలోనే తింటూ అక్కడే నిద్రపోతున్నారు . దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే శ్మశాన పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. వివరాలప్రకారం..
పాలకొల్లు పట్టణంలో రూ.3.50 కోట్లతో స్థానికంగా చేపట్టిన హిందూ శ్మశానవాటిక పనులు నిలిచిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఆ ఆలోచనను స్మశానంలో అమలు చేశారు. రాత్రి అక్కడే టిఫిన్‌ తిన్నారు. అక్కడే మంచంపై నిద్రించారు. ఈ విషయం తెలియగానే అధికారులు ఉరుకులుపరుగులు పెట్టారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయడానికి ఓ కదలిక వచ్చింది. రాత్రంతా స్మశానంలో జాగారం చేసిన ఎమ్మెల్యే ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత కప్పు కాఫీ తాగుతూ దినపత్రికలు చదివారు. అధికారులతో చర్చించారు. ఇంతకాలం స్మశానవాటిక అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని అధికారులు కార్మికులను వెంటపెట్టుకుని వచ్చారు.