ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని సైనిక పెట్రోల్‌ పార్టీపై ఉగ్రవాదులు కొద్దసేపటి క్రితం  దాడికి దిగారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే జాతీయ రహదారిని పర్యవేక్షిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు దాడికి దిగడం తో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ నేపధ్యంలో ఎదురుకాల్పులు జరపడం తో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఫోన్‌ సేవలు కూడా నిలిపివేశారు.