2019 ఎన్నికల్లో పవన్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా. . ?

వాస్తవం ప్రతినిధి: 2019 ఎన్నికల్లో “పవన్” కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా. .? ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ ఎన్నికల్లో త్రిముఖ పోటీలో దాదాపు 70 లక్షలు ఒట్లు కొల్ల గొట్టారు.  2014 ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ని స్దాపించారు. . . అయితే 2014 ఎన్నికల్లో మాత్రం పవన్ రాష్ట్రంలో ఏ ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండా ఆ ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ కి ఒటు వేయమంటూ ప్రచారం చేశారు . . దీంతో ఒక రకంగా 2014లో దాదాపు అధికారంలో కి రావల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒటమి పాలైంది. . . రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5లక్షల మెజారిటీ అంటే రాష్ట్రంలో పోటీ చేసిన నియోజకవర్గాల్లో కొన్ని స్దానాల్లో అతి స్వల్ప మెజార్టీతో ఆ స్థానాల్లో పార్టీ ఒటమి పాలైందని, ఇది కేవలం పవన్ ప్రచారం వల్లనేనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. . . అయితే పవర్ కోసం కాదు. . . ప్రశ్నించటం కోసం . . . అంటూ పవన్ తాను ఒట్లేసి గెలిపించమన్న పార్టీలపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. . దీంతో 2014లో తాను జత కట్టిన పార్టీలు బీజేపీ , టీడీపీ లతో మిత్ర బంధాన్ని దాదాపుగా తెంచేసుకున్నానని బహిరంగ ప్రకటన చేశారు . . . రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుందని, గ్రామ పంచాయతీ ల నుండి ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని బహిరంగంగానే పవన్ ప్రకటించారు . . . . ఇక్కడే మెదలైంది అసలు రాజకీయం. . . రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం దాదాపుగా 28శాతం ఉందని అంచనా. . రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కి ఆ వర్గీయులుతో పాటు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఉన్న ఆయన అభిమానులతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టం కడతారని నిపుణుల అంచనా. . . అయితే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ , వైకాపా, జనసేన లు మధ్యన మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ నెలకొంది. . వైకాపా అధినేత జగన్ గత కొంత కాలంగా వివిధ రకాల కార్యక్రమాల పేరిట నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. . ఇటీవల కాలంలో జగన్” ప్రజా సంకల్ప యాత్ర ” పేరిట పాదయాత్ర చేపట్టారు. . పవన్ కూడా నేటి నుండి “ప్రజా పోరాట యాత్ర ” పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నారు. . . అధికార పార్టీ టీడీపీ కూడా మరోవైపు గత నాలుగేళ్ళుగా చేసిన అభివృద్ధి , రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఒోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. . . ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుంది. జనసేన పార్టీ నెలకొల్పిన తర్వాత మెట్టమెదటి సారిగా పవన్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. . . దీంతో రాజకీయాల్లో ఈ ధపా కోంత ఆశక్తి నెలకోంది. . . రానున్న ఎన్నికల్లో పవన్ కింగ్ అవుతారా. . ? కింగ్ మేకర్ అవుతారా అన్నది రాజకీయ విశ్లేషకుల్లో కూడా చర్చ జరుగుతుంది.
                                                                                   .. భాస్కర్