లాలూ తో పాటు మరో 14 మందిపై అభియోగపత్రాలు నమోదు చేసిన సీబీఐ

వాస్తవం ప్రతినిధి: బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ అబియోగ పత్రాలను దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో లాలు భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. రబ్రీ దేవిని ఇటీవల సీబీఐ ప్రశ్నించిన సంగతి విదితమే. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ప్రతిఫలంగా ‘డిజిటల్‌ మార్కెటింగ్‌’ అనే బినామీ కంపెనీ పేరుతో పట్నాలో మూడు ఎకరాల భూమిని ‘నీకిది-నాకిది’ పద్ధతిలో సొంతం చేసుకున్నారని అభియోగపత్రంలో సీబీఐ నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాణా కుంభకోణాల కేసు లకు సంబంధించి లాలూ బీర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.