రష్యా ను శత్రువుగా చిత్రీకరించలేము: జర్మనీ అధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: రష్యా తో తమకున్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని రష్యాను, రష్యా ప్రజలను శత్రువులుగా చిత్రీకరించలేమని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మర్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశం తో ఉన్న సంబంధాలను దృష్టిలో వుంచుకుని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు మరింతగా సాయపడాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిరియాపై అమెరికా నేతృత్వంలో సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు దిగడంతో సిరియా యుద్ధ ప్రాంతాల్లో అమెరికా, రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ నెలకొనే ప్రమాదం పొంచివుందని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే అవకాశం వుందని, అయినా రష్యాను శత్రువుగా ప్రకటించలేమని, అందుకు తమ చరిత్ర అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.